Madhya Pradesh: ఒళ్లు జలదరించే ఘటన.. ప్రియుడి మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టిన ప్రియురాలు.. సమాధి పక్కనే నిద్ర!

Girl resides with Boy friends grave in Madhyapradesh
  • మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఘటన
  • గొడవతో మనస్తాపం చెంది ప్రియుడి ఆత్మహత్య
  • యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో వెలుగులోకి
ప్రియుడి మృతదేహాన్ని ఇంట్లోనే పాతిపెట్టి రెండు నెలలుగా అతడి సమాధి పక్కనే నిద్రపోతోందో ప్రియురాలు. మధ్యప్రదేశ్‌లోని కుసమీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం..  జానూసింగ్ (25), సత్నా జిల్లాకు చెందిన ఇషాన్ మొహమ్మద్ (27) ప్రేమికులు. కొంతకాలం క్రితం వీరు కామాక్ష్ గ్రామానికి వచ్చి సహజీవనం చేస్తున్నారు.

ఈ క్రమంలో గతేడాది డిసెంబరులో వీరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు అదే నెల ఏడో తేదీన ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని జానూసింగ్ ఇంట్లోనే అతడి మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. అప్పటి నుంచి అతడి సమాధి పక్కనే నిద్రించసాగింది.

మరోవైపు, తమ కుమారుడు కనిపించడం లేదంటూ ఇషాన్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జానూ-ఇషాన్‌లు ప్రేమికులని తేలడంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. డిసెంబరులో తమ మధ్య గొడవ జరిగిందని, దీంతో అతడు ఉరివేసుకున్నాడని తెలిపింది. అయితే, ఆ సమయంలో తాను ఇంట్లో లేనని చెప్పిన ఆమె.. ఆ తర్వాత ఇంట్లోనే అతడి మృతదేహాన్ని ఖననం చేసినట్టు వివరించింది.
Madhya Pradesh
lovers
Crime News

More Telugu News