Road Accident: మియాపూర్‌లో కారు బీభత్సం.. వాహనాలను ఢీకొట్టి పాన్‌షాప్‌లోకి దూరిన వైనం!

  • బెంబేలెత్తిన వాహనదారులు
  • క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన స్థానికులు
  • పోలీసుల అదుపులో డ్రైవర్
Car accident in Miyapur

హైదరాబాద్ శివారులోని మియాపూర్‌లో ఈ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తూ అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. అదే వేగంతో ముందుకు వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న పాన్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు వాహనదారులు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో వాహనదారులు బెంబేలెత్తిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును షాపు నుంచి బయటకు తీశారు. కేసు నమోదు చేసుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

More Telugu News