Lavanya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Lavanya gets trained in Hocky for her forthcoming film
  • హాకీలో శిక్షణ పొందుతున్న లావణ్య 
  • కొత్త తరహా పాత్రలో రామ్ చరణ్ 
  • పొలాచ్చిలో 'టక్ జగదీశ్' సందడి  
 *  తాను నటించనున్న ఓ చిత్రం కోసం కథానాయిక లావణ్య త్రిపాఠి ప్రస్తుతం హాకీ క్రీడలో శిక్షణ పొందుతోంది. సందీప్ కిషన్, లావణ్య జంటగా హాకీ నేపథ్యంలో 'ఏ 1 ఎక్స్ ప్రెస్' పేరిట ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం కోసమే ప్రస్తుతం లావణ్య శిక్షణ తీసుకుంటోంది.
*  చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో రామ్ చరణ్ ప్రత్యేక పాత్ర పోషించనున్న సంగతి విదితమే. ఇందులో ఆయన నక్సలైట్ గా తీవ్రవాది పాత్రలో నటించనున్నట్టు సమాచారం.
*  నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న 'టక్ జగదీశ్' చిత్రం షూటింగ్ ప్రస్తుతం పొలాచ్చిలో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై మరో వారం రోజుల పాటు అక్కడ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఇందులో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  
Lavanya
Chiranjivi
Ramcharan
Nani
Ritu Varma

More Telugu News