Ramayapatnam: రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP Government notifies Ramayapatnam port geo coordinates
  • నాన్ మేజర్ పోర్టుగా నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం
  • జియో కోఆర్డినేట్స్ నోటిఫై చేసిన మౌలిక వనరుల కల్పన శాఖ
  • పోర్టుకు 30 కిమీ పరిధిలో మరో పోర్టు నిర్మించరాదని నిర్ణయం
ప్రకాశం జిల్లా రామాయపట్నంలో నిర్మించ తలపెట్టిన పోర్టును నాన్ మేజర్ పోర్టుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విధివిధానాల్లో భాగంగా పోర్టు జియో కోఆర్డినేట్స్ ను మౌలిక వనరుల కల్పన శాఖ నోటిఫై చేసింది. ఏపీ మారిటైమ్ బోర్డు ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపింది. ఈ క్రమంలో పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కిలోమీటర్ల పరిధిలో మరో పోర్టు నిర్మించరాదని నిర్ణయించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై డీపీఆర్ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తున్నట్టు తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Ramayapatnam
Port
Non Major
Geo Coordinates

More Telugu News