ఏపీలో జీఎస్టీ చట్టం ప్రకారం మొట్టమొదటి అరెస్టు
- విశాఖలోని శేఖర్ ట్రేడర్స్, వెంకటసాయి ట్రేడర్స్ యజమాని శేఖర్
- ఆన్ లైన్ వే బిల్లుల దుర్వినియోగం
- రూ.2.6 కోట్ల పన్ను ఎగవేత
పాత ఇనుము వ్యాపారం పేరుతో గాజువాకలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న శేఖర్, ఆన్ లైన్ వే బిల్లులను దుర్వినియోగం చేయడం ద్వారా రూ.2.6 కోట్ల పన్ను ఎగవేశాడు. మరికొందరు వ్యాపారులు రూ.10 కోట్ల వరకు పన్ను ఎగవేసి ఉండొచ్చని అధికారుల అంచనా.