B.Gopal: 'బొబ్బిలి రాజా'లో పాముల సీన్ ను వెంకటేశ్ చాలా ధైర్యంగా చేశాడు: దర్శకుడు బి.గోపాల్

Bobbili Raja Movie
  • 'బొబ్బిలి రాజా' క్లైమాక్స్ సీన్ నంద్యాల ఫారెస్టులో చేశాము 
  •  పాముల సీన్ ను రామానాయుడు స్టూడియోలో తీశాము 
  • 200 పాములు తెప్పించామన్న బి.గోపాల్         
వెంకటేశ్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో 'బొబ్బిలి రాజా' ఒకటిగా కనిపిస్తుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా విజయ విహారం చేసింది. అలాంటి ఈ సినిమాకి బి.గోపాల్ దర్శకుడిగా వ్యవహరించాడు. 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాను గురించి ప్రస్తావించాడు.

'బొబ్బిలి రాజా' సినిమా క్లైమాక్స్ ను నంద్యాల ఫారెస్టులో చిత్రీకరించాము. గూడ్స్ రైలుపై ఫైట్ సీన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బోగీ లోపల 200 పాములకు సంబంధించిన సీన్ ను .. నాయుడిగారి స్టూడియోలో వేసిన సెట్లో చిత్రీకరించాము. సాధారణంగా ఒక పాము దగ్గరగా ఉండాలంటేనే చాలామంది భయపడతారు. కానీ 200ల పాముల మధ్య వెంకటేశ్ చాలా ధైర్యంగా కూర్చుని చేశాడు. ఒక పాము నిజంగానే ఆయన మెడ వరకూ పాకింది. అయినా భయపడకుండా ఆయన చేశాడు" అని చెప్పుకొచ్చారు.
B.Gopal
Venkatesh
Bobbili Raja Movie

More Telugu News