Samantha: నేను చాలా లక్కీ... ఏం ఊహించుకున్నానో డైరెక్టర్లు అదే తీశారు: సమంత

Samantha talks about film making
  • జానులో నటించిన సమంత
  • సమంత నటనకు విమర్శకుల ప్రశంసలు
  • ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సామ్
  • చైతూ సినిమాల్లో జోక్యం చేసుకోనని స్పష్టీకరణ
ఇటీవల విడుదలైన జాను చిత్రంతో నటనపరంగా సమంత మంచి మార్కులే కొట్టేశారు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసే సమంత జానుతో మరో మెట్టు ఎక్కారని విమర్శకులు సైతం ప్రశంసించారు. ఈ క్రమంలో సమంత ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన భర్త నాగచైతన్యకు సినిమాల ఎంపికలో తాను ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. చైతూ సినిమాల విషయంలో ఎంతమాత్రం తాను జోక్యం చేసుకోనని వెల్లడించారు.

సినిమాలు స్క్రిప్టు దశలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అనిపిస్తాయని, కానీ అందరు దర్శకులు స్క్రిప్టును ఉన్నది ఉన్నట్టుగా తీయలేరని అభిప్రాయపడ్డారు. "కొందరు స్క్రిప్టు వివరించే విధానం అద్భుతంగా ఉంటుంది కానీ తెరకెక్కించే విధానం తేలిపోతుంది. ఈ విషయంలో నా వరకు నేను చాలా లక్కీ. నేను స్క్రిప్టులో ఏం ఊహించుకున్నానో నా డైరెక్టర్లు అదే తెరకెక్కించారు. రంగస్థలం చిత్రం విషయానికొస్తే నాకు పూర్తి స్క్రిప్టు అస్సలు తెలియదు. నా పాత్రలో ఏదో మ్యాజిక్ ఉందనుకున్నానంతే. అదే నిజమైంది" అంటూ వివరించారు.
Samantha
Janu
Naga Chaitanya
Directors
Tollywood

More Telugu News