yogi: యూపీ బడ్జెట్​ ఐదు లక్షల కోట్లు.. అయోధ్యలో ఎయిర్​ పోర్టు కోసం రూ.500 కోట్లు

  • కాశీ విశ్వనాథ ఆలయానికి రూ.200 కోట్లు
  • అయోధ్యలో పర్యాటకాభివృద్ధికి రూ.95 కోట్లు
  • భారీ అంచనాలతో బడ్జెట్ యోగి సర్కారు ప్రతిపాదనలు
Yogi Government Presents Rs 5 Lakh Crore UP Budget

ఉత్తర ప్రదేశ్ లో యోగి సర్కారు ఐదు లక్షల కోట్ల రూపాయలకుపైగా అంచనాలతో భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. యూపీ ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా మంగళవారం అక్కడి అసెంబ్లీలో బడ్జెట్ ను సమర్పించారు. గత బడ్జెట్ తో పోలిస్తే 33,159 కోట్లు అదనంగా చేరుస్తూ.. రూ. 5,12,860 కోట్ల ఆదాయ, వ్యయ అంచనాలను పేర్కొన్నారు.

అయోధ్యపై దృష్టి

అయోధ్యలో రామాలయం నిర్మించనున్న నేపథ్యంలో అక్కడి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టింది. అయోధ్యలో ఎయిర్ పోర్టు కోసం రూ.500 కోట్లు, పర్యాటక అభివృద్ధి కోసం రూ.85 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.10 కోట్లు ఇచ్చింది.

వారణాసికి వందల కోట్లు

ప్రముఖ పుణ్య క్షేత్రం వారణాసి (కాశీ)లో అభివృద్ధి పనులు, ఇతర ఏర్పాట్ల కోసం యోగి సర్కారు వందల కోట్ల రూపాయలు కేటాయించింది. కాశీ విశ్వనాథుడి ఆలయం విస్తరణ, సుందరీకరణకు రూ.200 కోట్లు, వారణాసిలో కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు రూ.180 కోట్లు ఇచ్చింది.

ఇది నాలుగో బడ్జెట్

యూపీలో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని సర్కారు ఏర్పాటైన తర్వాత బడ్జెట్ మొత్తాన్ని గణనీయంగా పెంచుతున్నారు. యోగి సర్కారు తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ నాలుగవది. యూపీకి వచ్చే ఆదాయంలో రాష్ట్ర సొంత ట్యాక్సుల నుంచి రూ.1.66 లక్షల కోట్లు, కేంద్రం నుంచి వచ్చే రాష్ట్రవాటా సొమ్ము రూ.1.52 లక్షల కోట్లు.. రెండూ కలిపి రూ.3.18 లక్షల కోట్లు వస్తాయని బడ్జెట్ అంచనాల్లో పేర్కొన్నారు.

More Telugu News