B.Gopal: ఒకే ఏడాదిలో నాలుగు భారీ హిట్లు ఇచ్చాను: దర్శకుడు బి.గోపాల్

Gopal Hit Movies
  • 1990 నాకు గోల్డెన్ ఇయర్ 
  •  ఆ ఏడాదిలో నా సినిమాలు నాలుగొచ్చాయి
  • తనకి ఆనందంగా అనిపించిందన్న బి.గోపాల్
దర్శకుడిగా బి.గోపాల్ కి మంచి పేరుంది. చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ .. మోహన్ బాబులతో ఆయన చేసిన చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఆ హీరోల కెరియర్లో అవి చెప్పుకోదగిన చిత్రాలుగా నిలిచిపోయాయి. వెంకటేశ్ తో ఆయన చేసిన 'బొబ్బిలిరాజా'..  మోహన్ బాబుతో ఆయన చేసిన 'అసెంబ్లీ రౌడీ'ని ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు.

తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ .. "నా కెరియర్లో 1990ని గోల్డెన్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. నేను దర్శకత్వం వహించిన 'లారీ డైవర్'.. 'బొబ్బిలిరాజా' .. 'అసెంబ్లీ రౌడీ' .. 'రౌడీ ఇన్ స్పెక్టర్' ఆ ఏడాదిలోనే వరుసగా వచ్చాయి. భారీ విజయాలను అందుకున్నాయి. అలా నాలుగు సినిమాలు ఒకే ఏడాదిలో వరుసగా విజయాలను అందుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది" అని చెప్పుకొచ్చారు.
B.Gopal
Chiranjeevi
Balakrishna
Nagarjuna
Venkatesh

More Telugu News