Nithin: 'భీష్మ' కథను మలుపుతిప్పే పాత్రలో హెబ్బా పటేల్

Bheeshma Movie
  • వెంకీ కుడుముల నుంచి 'భీష్మ'
  • నితిన్ జోడీగా రష్మిక మందన్న  
  • ఈ నెల 21వ తేదీన విడుదల  
నితిన్ కథానాయకుడిగా దర్శకుడు వెంకీ కుడుముల 'భీష్మ' సినిమాను రూపొందించాడు. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించగా, మరో కథానాయికగా హెబ్బా పటేల్ కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె పాత్ర ఏమై ఉంటుంది? అనే ఆసక్తి యూత్ లో నెలకొంది. ఈ సినిమాలో ఆమె ఏదో సాదా సీదా పాత్రలో కనిపించడం లేదట. కథను కీలకమైన మలుపు తిప్పే పాత్రలో ఆమె కనిపించనుందనేది తాజా సమాచారం.

ఈ సినిమా హైలైట్స్ లో ఆమె పాత్ర ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఆమె కెరియర్ కి ఈ పాత్ర మంచి హెల్ప్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 'కుమారి 21F' సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హెబ్బా పటేల్, ఆ తరువాత ఒకటి రెండు సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. కొంతకాలంగా వరుస పరాజయాలు పలకరిస్తూ ఉండటంతో రేస్ లో వెనుకబడిపోయింది. 'భీష్మ' సినిమా మళ్లీ ఆమెను నిలబెడుతుందేమో చూడాలి.
Nithin
Rashmika Mandanna
Hebah Patel
Bheeshma Movie

More Telugu News