Pakistan: పాక్ లో కబడ్డీ వరల్డ్ కప్ ఫైనల్స్... ఇండియాను ఓడించారట... ఇమ్రాన్ ట్వీట్.. నెటిజన్ల జోకులు!

  • పాక్ లో జరిగిన సర్కిల్ కబడ్డీ పోటీలు
  • ఫైనల్స్ లో ఇండియాపై 43-41 తేడాతో పాక్ గెలిచిందట
  • జట్టును పంపలేదని ఏకేఎఫ్ఐ వివరణ
Imran Khan congratulates his Kabaddi Team

సామాజిక మాధ్యమాల సాక్షిగా, ఇమ్రాన్ ఖాన్ మరోసారి విమర్శల పాలయ్యారు. "కబడ్డి ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ను ఓడించి, కప్పు గెలిచిన పాకిస్తాన్ జట్టుకు శుభాకాంక్షలు" అంటూ ఆయన ఓ ట్వీట్ చేయగా, భారత్ నుంచి కబడ్డీ జట్టు పాకిస్థాన్ కు ఎప్పుడు వచ్చిందని నెటిజన్లు తిట్ల దండకాన్ని అందుకున్నారు.

ఇక్కడి నుంచి అధికారికంగా ఏ జట్టూ వెళ్లకపోయినా, ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇండియాపై 43-41 తేడాతో పాక్ గెలిచిందని అక్కడి పత్రికలు రాశాయి. తమ జట్టుకు ప్రధాని ఇమ్రాన్ శుభాకాంక్షలు కూడా తెలిపారు.

ఇక పాక్ లో నిర్వహిస్తున్న సర్కిల్ కబడ్డీ వరల్డ్ కప్ కు తాము ఎటువంటి జట్టునూ పంపలేదని ఏకేఎఫ్‌ఐ (అమెచ్యూర్ కబడ్డి ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) స్పష్టం చేసింది. ఈ మేరకు పాక్ బోర్డుకు ముందే లేఖ రాసి, అదే విషయాన్ని ఐఓఏ (ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్)కు కూడా తెలిపింది.

ఇదిలావుండగా,  కొందరు పంజాబ్ ఆటగాళ్లు సర్కిల్ కబడ్డీని ఎక్కువగా ఆడుతుంటారు. వారిలో కొందరు అనుమతులు లేకుండా పాక్ కు వెళ్లి ఈ పోటీల్లో పాల్గొన్నారని కొందరు ఆరోపిస్తున్నారు.

More Telugu News