'ఆర్ఆర్ఆర్' నుంచి మరో లీక్... రామరాజు, సీత ఇలా..!
- శరవేగంగా తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్'
- తాజాగా లీక్ అయిన మరో పిక్
- ఫ్యాన్ మేడ్ అని కొందరంటున్నా వైరల్
ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి రామరాజుగా నటిస్తుండగా, ఆయన సరసన సీతగా ఆలియా భట్ నటిస్తోంది. రామరాజుగా రామ్ చరణ్, సీతా మహాలక్ష్మిగా ఆలియా భట్ ఇలాగే కనిపించనున్నారంటూ, ఓ రెండు చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఎన్నడో తీసిన పాతకాలం నాటి చిత్రాలుగా ఇవి కనిపిస్తున్నాయి. వీటిని సినిమా కథానుసారం, ఫైల్ ఫొటోలుగా వినియోగించారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ ఫొటోలో రామ్ చరణ్, బ్రిటీష్ సైనిక అధికారిగా కనిపిస్తున్నాడు. ఇక అల్లూరి సీతారామరాజు తన జీవితంలో బ్రిటీష్ అధికారిగా పని చేయలేదు. ఇక ఈ ఫొటో వెనకున్న స్టోరీ ఏంటి? అది ఎలా వచ్చిందో తెలియాలంటే, సినిమా విడుదలయ్యేంత వరకూ ఆగక తప్పదు.
కాగా, ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని అంటున్న వారూ లేకపోలేదు. ఏది ఏమైనా 'ఆర్ఆర్ఆర్' గురించి బయటకు వచ్చే ఏ సమాచారం అయినా, అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తుంది కాబట్టి, ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి.