Koneru Hampi: కోనేరు హంపిని అభినందించిన వైఎస్ జగన్!

Jagan Wishes Koneru Hampi
  • కెయిన్స్ లో ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్
  • చాంపియన్ గా నిలిచిన కోనేరు హంపి
  • మరిన్ని విజయాలు సాధించాలన్న జగన్
యూఎస్ లోని కెయిన్స్‌ లో జరిగిన ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌ కెయిన్స్ కప్ లో చాంపియన్‌ గా నిలిచిన గ్రాండ్‌ మాస్టర్‌ కోనేరు హంపిని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అభినందించారు. హంపి సాధించిన విజయం రాష్ట్రంతో పాటు, దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు. 2020 సంవత్సరాన్ని విజయంతో ప్రారంభించిన హంపి, అదే ఊపును కొనసాగించాలని, రానున్న కాలంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కాగా, పదిమంది క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్ల క్లాసికల్‌ ఫార్మాట్‌ లో జరిగిన టోర్నీలో హంపి ఆరు పాయింట్లు సాధించి, టాప్-1 గా నిలిచి, కప్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Koneru Hampi
Jagan
Kains International Chess
Champion

More Telugu News