Tapas Pal: బెంగాలీ నటుడు, టీఎంసీ మాజీ ఎంపీ తపస్ పాల్ గుండెపోటుతో కన్నుమూత!

TMC Ex MP Tapas Pal Passes Away
  • కుమార్తెను చూసేందుకు ముంబై వెళ్లిన తపస్ పాల్
  • విమానాశ్రయంలో గుండెపోటు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ప్రముఖ బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తపస్ పాల్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆయన కన్నుమూశారని కుటుంబీకులు తెలిపారు. తన కుమార్తెను చూసేందుకు ముంబై వెళ్లిన ఆయన, తిరిగి గత రాత్రి బయలుదేరారు.

విమానాశ్రయంలో తన ఛాతీలో నొప్పిగా ఉందని ఆయన సహాయక సిబ్బందికి చెప్పడంతో, ఆయన్ను హుటాహుటిన జుహులోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. కాగా, ఆయనకు భార్య నందిని, కుమార్తె సోహిని పాల్ ఉన్నారు. గతంలో కూడా తపస్ పాల్ గుండెజబ్బుతో బాధపడ్డారు.

1980లో 'దాదర్ కీర్తి' సినిమాతో బెంగాలీ చిత్ర పరిశ్రమలో కాలుమోపిన ఆయన, 1984లో మాధురీ దీక్షిత్ తో కలిసి 'అబోద్' చిత్రంలో నటించారు. ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లో ప్రవేశించి, రాజకీయాల్లోనూ రాణించారు.

  • Loading...

More Telugu News