IRCTC: కాశీ-మహాకాళ్ ఎక్స్ ప్రెస్ లో దేవుళ్లకు బెర్త్ రిజర్వ్ పై స్పందించిన రైల్వే శాఖ!

  • రైలు సిబ్బంది పూజలు చేశారు
  • రైలు విజయవంతం కావాలని వారు ప్రార్థించారు
  • శాశ్వత పూజా గది కాదన్న ఐఆర్సీటీసీ
IRCTC Clarifies No Permenent Bearth Dedicated to Lord Shiva

ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ, రిమోట్ ద్వారా ప్రారంభించిన కాశీ-మహాకాళ్ ఎక్స్ ప్రెస్ లోని ఓ సైడ్ అప్పర్ బెర్త్ ను పూజా మందిరంగా మార్చారని వచ్చిన వార్తలపై రైల్వే శాఖ స్పందించింది. దేవుళ్లకు ఓ బెర్త్ ను కేటాయించారని వార్తలు రావడం, దీనిపై పలువురు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.

ఈ వివాదంపై స్పందించిన ఇండియన్ రైల్వేస్ కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ), "వాణిజ్య పరమైన రైళ్లలో అటువంటి రిజర్వ్ లు లేదా శాశ్వత బెర్త్ లు ఉండవు. కాశీ- మహాకాళ్ ఎక్స్ ప్రెస్ లో కొందరు రైల్వే స్టాఫ్ తాత్కాలికంగా దేవుళ్ల పటాలను పెట్టి, పూజ చేశారు. ఈ కొత్త ప్రాజెక్టు విజయవంతం కావాలని వారు కోరుకున్నారు. ఈ పూజ కేవలం ఒక్కసారికే పరిమితం. శాశ్వతంగా చిత్ర పటాలు ఉండవు" అని స్పష్టం చేసింది. కాగా, ఈ రైలు ఇండోర్ నుంచి వారణాసికి ప్రయాణిస్తుంది. ఓంకారేశ్వర్, మహా కాళేశ్వర్, కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగాలను కలుపుతుంది.

More Telugu News