RS Bharathi: ముంబై రెడ్ లైట్ ఏరియాల్లా మారిన టీవీ చానెళ్లు: డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు

  • మోసాలు చేయడం, డబ్బు డిమాండ్ చేయడమే వారి వ్యాపకం
  • వైరల్ అయిన డీఎంకే నేత ఆర్ఎస్ భారతి వ్యాఖ్యలు
  • తీవ్రంగా ఖండించిన చెన్నై ప్రెస్ క్లబ్
TV Media Like Mumbai Red Light Areas

మీడియా హౌస్ లను ముంబైలోని వేశ్యా వాటికలతో పోల్చిన డీఎంకే నేత ఆర్ఎస్ భారతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టీవీ మీడియా, జర్నలిస్టులు ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలోని వేశ్యలుగా మారారని, మోసాలు చేయడం, డబ్బు డిమాండ్ చేయడం వారి ప్రధాన వ్యాపకంగా మారిందని వ్యాఖ్యానించారు. భారతి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, చెన్నై ప్రెస్ క్లబ్ ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. భారతి వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరింది.

తమ పార్టీ ప్రశాంత్ కిశోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకోనుందని మీడియాలో వచ్చిన వార్తలను ప్రస్తావించిన ఆయన, వార్తా చానెళ్లపై మండిపడ్డారు. చానెళ్ల యజమానులు వాటిని రెడ్ లైట్ ఏరియాల మాదిరిగా నిర్వహిస్తున్నారని నిప్పులు చెరిగారు. భారతి వ్యాఖ్యలపై ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

More Telugu News