Rashmika Mandanna: సెల్ఫీ కోసం వచ్చి నటి రష్మికకు ముద్దిచ్చిన అభిమాని.. కాసేపటికి కానీ తేరుకోలేకపోయిన నటి!

Actress Rashmika Mandanna shocked as fan gave kiss while taking selfie
  • ఓ ఈవెంట్‌కు హాజరైన రష్మిక మందన్న
  • చూసేందుకు పోటెత్తిన అభిమానులు
  • రష్మిక ఫిర్యాదుతో వీడియోను తొలగించిన పోలీసులు
కన్నడ నటి రష్మిక మందన్నకు ఓ అభిమాని షాకిచ్చాడు. సెల్ఫీ దిగడానికి వచ్చి ముద్దు పెట్టి పరారయ్యాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో రష్మిక సహా అక్కడున్న వారందరూ షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘చలో’ సినిమాతో తెరంగేట్రం చేసిన రష్మిక.. ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆమె నటించిన ‘భీష్మ’ సినిమా ఈ నెల 21న రిలీజ్‌ కాబోతోంది.

ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన రష్మికను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. సెల్ఫీల కోసం రిక్వెస్ట్ చేశారు. అభిమానులను నిరాశపరచడం ఇష్టం లేని రష్మిక వారితో సెల్ఫీలు దిగింది. ఈ క్రమంలో ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగి ఆ వెంటనే ముద్దు పెట్టి పరారయ్యాడు. ఇది చూసిన అందరూ షాక్. అభిమాని ఆమెకు ముద్దుపెడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంతో స్పందించిన రష్మిక కార్యక్రమ నిర్వాహకులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించారు.
Rashmika Mandanna
Tollywood
selfie
kiss

More Telugu News