గుంటూరు జిల్లా చినకాకానిలో దారుణం.. మహిళపై సామూహిక అత్యాచారం!

17-02-2020 Mon 21:37
  • మంగళగిరి మండలంలో ఘటన
  • దారుణానికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులు
  • పోలీసుల అదుపులో నిందితులు
Gang Rape in chinakakani
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మంగళగిరి మండలంలోని చినకాకానిలో ఓ మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళను వివస్త్రను చేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు సమాచారం. కామాంధుల బారి నుంచి తప్పించుకునేందుకు బాధిత మహిళ నగ్నంగానే సుమారు రెండు వందల మీటర్ల దూరం పరిగెత్తినట్టు సమాచారం. మహిళను వెంటాడి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.