Manchu Manoj: మరో కథానాయికను పరిచయం చేస్తున్న మంచు మనోజ్

Aham Brahmasmi Movie
  • మంచు మనోజ్ నుంచి 'అహం బ్రహ్మస్మి'
  • దర్శకుడిగా శ్రీకాంత్ రెడ్డి 
  • కథానాయికగా ప్రియా భవానీ శంకర్
వరుస పరాజయాలను చవిచూసిన మంచు మనోజ్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని తాజాగా ఒక సినిమా చేయడానికి రంగంలోకి దిగాడు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి 'అహం బ్రహ్మస్మి' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. గతంలో తన సినిమాల ద్వారా మంచు మనోజ్ కొంతమంది కథానాయికలను పరిచయం చేశాడు.

ఇప్పుడూ అలాగే ఈ సినిమా ద్వారా ప్రియా భవానీ శంకర్ పరిచయం అవుతోంది. తమిళంలో బుల్లితెరపై యాంకర్ గా సందడి చేస్తూ ప్రియా భవానీ శంకర్ మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె 'భాతీయుడు 2' సినిమాలో ఒక చిన్న పాత్రను చేస్తోంది. 'అహం బ్రహ్మస్మి' సినిమాలో ఆమె పాత్రకి చాలా ప్రాధాన్యత ఉన్నట్టుగా తెలుస్తోంది. గతంలో మనోజ్ 'శ్రీ' సినిమా ద్వారా పరిచయం చేసిన తమన్నా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. ఇక ప్రియా భవానీ శంకర్ కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.
Manchu Manoj
Priya Bhavani Shankar
Aham Brahmasmi Movie

More Telugu News