Pawan Kalyan: సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కల్యాణ్

Pawan Kalyan wishes CM KCR
  • ఇవాళ కేసీఆర్ పుట్టినరోజు
  • శుభాకాంక్షల జల్లులో తడిసిముద్దవుతున్న తెలంగాణ సీఎం
  • ట్విట్టర్ లో విషెస్ తెలిపిన జనసేనాని
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు కేసీఆర్ 66వ పుట్టినరోజును పురస్కరించుకుని పవన్ ట్విట్టర్ లో స్పందించారు. "గౌరనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీకు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను అందించాలని కోరుకుంటున్నాను" అంటూ ట్వీట్ చేశారు.

కాగా, కేసీఆర్ బర్త్ డే సందర్భంగా తెలంగాణలోనే కాకుండా విదేశాల్లో సైతం అభిమానులు వేడుకలు నిర్వహిస్తున్నారు. బహ్రెయిన్ తదితర దేశాల్లో కేకులు కట్ చేసి తమ ఆనందం వ్యక్తం చేశారు.
Pawan Kalyan
KCR
Birthday
Wishes

More Telugu News