Dalai Lama: చాలామంది ఆనందం ఎక్కడో ఉంటుందని వెతుకుతుంటారు: దలైలామా

Dalai Lama explains how happiness comes
  • దలైలామా ఆసక్తికర ట్వీట్
  • సంతోషం మనలోనే ఉంటుందని వివరణ
  • సహృదయత, ఇతరుల పట్ల దయతోనే ఆనందం కలుగుతుందని వెల్లడి

ప్రపంచబౌద్ధ మత గురువు, అత్యున్నత పీఠాధిపతి దలైలామా ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. జీవితంలో ఆనందం ఎక్కడ ఉంటుందో వెల్లడించారు. "జీవితానికి పరమావధి సంతోషంగా ఉండడమే. సమస్త మానవాళి దీన్ని దృష్టిలో ఉంచుకునే ఆనందం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. చాలామంది సంతోషం అనేది మానవుడికి వెలుపల వస్తు రూపేణా ఉంటుందని భావిస్తారు. అదో భౌతిక అంశమని నమ్మి వెతుకుతుంటారు. కానీ వాస్తవానికి అది మనలో నుంచే వస్తుంది. సహృదయత, సాటి మనుషుల పట్ల దయతోనే సంతోషం సాధ్యమవుతుంది" అంటూ వివరించారు.

  • Loading...

More Telugu News