Nara Lokesh: యువతకు జరుగుతున్న అన్యాయంపై టీఎన్ఎస్ఎఫ్ సదస్సులో చర్చించాం: నారా లోకేశ్

 Nara Lokesh says we discussed about injustice to youth inTNSF
  • టీఎన్ఎస్ఎఫ్ మేధోమథన సదస్సులో పాల్గొన్నాను
  • తొమ్మిది నెలల తుగ్లక్ పాలనలో యువతకు అన్యాయం
  • యువత ఉద్యోగావకాశాలను సీఎం జగన్ దెబ్బతీస్తున్నారు
తెలుగునాడు విద్యార్థి సమాఖ్య (టీఎన్ఎస్ఎఫ్) మేధోమథన సదస్సులో పాల్గొన్నానని టీడీపీ నేత నారా లోకేశ్ పేర్కొన్నారు. తొమ్మిది నెలల తుగ్లక్ పాలనలో యువతకు జరుగుతున్న అన్యాయం గురించి ఈ సదస్సులో చర్చించామని, మూడు రాజధానుల పేరుతో కంపెనీలను తరిమేస్తూ యువత ఉద్యోగావకాశాలను సీఎం జగన్ దెబ్బతీస్తున్నారని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.  ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని విద్యార్థి లోకానికి తెలియజేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని మార్గనిర్దేశం చేసినట్టు లోకేశ్ తెలిపారు.  
Nara Lokesh
Telugudesam
TNSF
Jagan
YSRCP
cm

More Telugu News