GV Harsha Kumar: న్యాయ శాఖ అధికారులపై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఫిర్యాదు

Former MP GV Harsha Kumar complains over his jail stint
  • ఇటీవలే జైలు నుంచి విడుదలైన హర్షకుమార్
  • అన్యాయంగా జైలుపాలు చేశారన్న మాజీ ఎంపీ
  • న్యాయశాఖ అధికారులు తనను ప్రత్యర్థిలా చూశారని ఆరోపణ
జ్యుడిషియల్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో 48 రోజుల పాటు జైలులో ఉన్న మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇటీవలే విడుదలయ్యారు. తాజాగా ఆయన న్యాయ, పోలీసు శాఖ అధికారులపై రాజమండ్రి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను అన్యాయంగా జైలులో ఉంచారని, అందుకు న్యాయ విభాగం, పోలీసు శాఖ అధికారులే కారణమని తన ఫిర్యాదులో ఆరోపించారు. ఎలాంటి తప్పుచేయకపోయినా 48 రోజుల పాటు జైలులో ఉంచారని, న్యాయశాఖ అధికారులు తనను ప్రత్యర్థిలా చూశారని ఆరోపించారు. అయితే తన ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయలేరని అన్నారు.
GV Harsha Kumar
Complaint
Rajamahendravaram
Police
Legal

More Telugu News