KTR: మా నాన్న ధైర్యశాలి...దయామయుడు: పుట్టిన రోజు సందర్భంగా కేటీఆర్‌ ట్వీట్‌

KTR prizes KCR was a great man
  • ఆయనది విలక్షణ వ్యక్తిత్వం
  • తెలంగాణ తల్లికి పుట్టిన బిడ్డ ఆయన
  • ఆయనను నాన్నా అని పిలవడానికి ఎంతో గర్విస్తాను

తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ తనయుడు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అమితానందాన్ని వ్యక్తం చేశారు. నాకు తెలిసి మానాన్న ధైర్యశాలి, దయామయుడు అని కితాబిచ్చారు. తెలంగాణ తల్లి కన్న ముద్దుబిడ్డ కేసీఆర్‌ అని కొనియాడారు. సోమవారం కేసీఆర్‌ తన 67వ పుట్టిన రోజు జరుపుకొంటున్న సందర్భంగా కేటీఆర్‌ విలక్షణమైన సందేశాన్ని ట్వీట్‌ చేశారు.

 ‘కేసీఆర్‌ గొప్ప చరిష్మా గల నాయకుడు. ఆయనను నాన్నా అని పిలవడానికి నేనెంతో గర్వపడతాను. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా ఆయన నాకు ఆదర్శం. దూరదృష్టి, నిబద్ధత కలిగిన మీరు కలకాలం ప్రజాసేవలో ఉండాలి’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

  • Loading...

More Telugu News