కేసీఆర్‌ గారూ... మీకు జన్మదిన శుభాకాంక్షలు: ఏపీ సీఎం జగన్‌

17-02-2020 Mon 12:07
  • మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి
  • మీకు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి
  • చిరకాలం ప్రజాసేవ చేయాలి
AP CM Jagan told birthday wishes to KCR

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేర‌కు ట్విట్టర్‌లో అభినందన సందేశాన్ని ఉంచారు. ‘మీకు ఎల్లప్పుడూ ఆ దేవుని కృప ఉండాలి. మీరు ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలి. సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలి. మీకు హార్ధిక శుభాకాంక్షలు’ అంటూ జగన్‌ ట్వీట్‌ చేశారు. సోమవారం సీఎం కేసీఆర్‌ తన 67వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. 1954 ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మించారు.