వనస్థలిపురంలో 'డీ మార్ట్' వద్ద కలకలం రేపుతున్న 'శ్రీ చైతన్య' ఇంటర్ విద్యార్థి మృతి

student died at vanasthalipuram
  • స్నేహితులతో కలిసి డీ మార్ట్‌కు వెళ్లిన సతీశ్
  • డీ మార్ట్‌ సిబ్బంది దాడి చేశారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు
  • సెక్యూరిటీ గార్డులు కొట్టడంతోనే మృతి చెందాడని ఆరోపణ
  • శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంపై కూడా ఫిర్యాదు 
హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ఓ విద్యార్థి మృతి చెందడం కలకలం రేపింది. అక్కడి డీ మార్ట్‌కు వెళ్లిన శ్రీ చైతన్య కళాశాల ఇంటర్‌ విద్యార్థి సతీశ్ అక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై అతడి కుటుంబ సభ్యులు పలు ఆరోపణలు చేశారు. స్నేహితులతో కలిసి నిన్న రాత్రి సతీశ్ డీ మార్ట్‌కు వెళ్లాడని, ఈ క్రమంలో అక్కడి సిబ్బందితో గొడవ జరిగిందని అన్నారు. సతీశ్‌ను డీ మార్ట్ సెక్యూరిటీ గార్డులు కొట్టడంతోనే మృతి చెందాడని చెప్పారు.

అలాగే, శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యంపై కూడా పోలీసులకు సతీశ్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కాలేజీ యాజమాన్యం సతీశ్‌ను ఉన్నట్టుండి ఇంటికి పంపించిందని ఈ క్రమంలోనే స్నేహితులతో కలిసి షాపింగ్‌కు వెళ్లాడని, కాలేజీపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Go Back to Shorts
Hyderabad
Crime News

More Telugu News