అజిత్ కి విలన్ కోసం వెతుకులాట .. తెరపైకి ఇద్దరు తెలుగు హీరోల పేర్లు

17-02-2020 Mon 09:05
  • అజిత్ కథానాయకుడిగా 'వాలిమై'
  • కథానాయికగా హుమా ఖురేషి 
  • వేసవిలో ప్రేక్షకుల ముందుకు
Telugu hero to act as villian for Ajith
అజిత్ ఎంత మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. వరుస విజయాలు ఆయన ఖాతాలో చేరిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తాజా చిత్రంగా 'వాలిమై' రూపొందుతోంది. బోనీ కపూర్ నిర్మాణంలో వినోత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది. త్వరలో విలన్ కాంబినేషన్లో సీన్లు చేయవలసి ఉందట.

విలన్ పాత్ర కోసం తెలుగు నుంచి యంగ్ హీరోలను తీసుకోవాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ఉన్నారట. ఈ నేపథ్యంలోనే తెలుగులో కార్తికేయ పేరు వినిపించింది. తాజాగా నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. ఇద్దరికీ కూడా నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను చేసిన అనుభవం వుంది. అజిత్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ ఇద్దరిలో విలన్ గా ఎవరిని ఎంపిక చేస్తారో చూడాలి మరి. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా హుమా ఖురేషి కనిపించనుంది. ఈ వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.