కేజ్రీవాల్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు!

17-02-2020 Mon 08:34
  • మోదీ ఆశీస్సులు కోరిన కేజ్రీవాల్
  • ఆ సమయంలో వారణాసి పర్యటనలో మోదీ
  • రాత్రి పూట ట్విట్టర్ లో స్పందన
Narendra Modi Wishes Kezriwal

హస్తిన పీఠాన్ని ముచ్చటగా మూడోసారి అధిష్ఠించిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, నిన్న తన ప్రమాణ స్వీకారం అనంతరం ప్రసంగిస్తూ, తనకు ప్రధాని నరేంద్ర మోదీ ఆశీర్వాదం కావాలని కోరిన సంగతి తెలిసిందే. వాస్తవానికి తన ప్రమాణానికి మోదీని కూడా ఆయన ఆహ్వానించారు. అయితే, ముందస్తుగానే వారణాసి పర్యటనను ఖరారు చేసుకున్న ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.

ఇక, వారణాసి నుంచి తిరిగి వచ్చిన తరువాత, రాత్రి సమయంలో తన ట్విట్టర్ వేదికగా, కేజ్రీవాల్ కు తన ఆశీస్సులను మోదీ అందజేశారు. "ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్ కేజ్రీవాల్ ను నేను అభినందిస్తున్నా. ఆయన భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని ట్వీట్ చేశారు.