ప్రత్యేక విమానంలో లక్నో వెళ్లిన సీఎం జగన్

16-02-2020 Sun 21:25
  • గన్నవరం నుంచి జగన్ లక్నో పయనం
  • ఐప్యాక్ టీమ్ డైరెక్టర్ రుషి వివాహ వేడుకకు హాజరు
  • రాత్రికి విజయవాడ తిరిగిరాక
Jagan flies Lucknow to attend a marriage

ఏపీ సీఎం జగన్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో వెళ్లారు. ఆయన లక్నోలో ఓ పెళ్లి వేడుకలో పాల్గొననున్నారు. కొద్దిసేపటి క్రితమే గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పయనమయ్యారు. ఈ రాత్రి 12.45 గంటలకు తిరిగి విజయవాడ చేరుకుంటారు. లక్నోలో ఐప్యాక్ టీమ్ డైరెక్టర్లలో ఒకడైన రుషి వివాహ వేడుక జరగనుంది. ఎన్నికల్లో వైసీపీ విజయానికి వ్యూహరచన చేసింది ఐప్యాక్ సంస్థే. ఇది ప్రశాంత్ కిషోర్ కు చెందిన సంస్థ. కాగా, రుషి వివాహానికి ప్రశాంత్ కిషోర్ కూడా హాజరవుతారని తెలుస్తోంది.