Nandigama: రహదారి భద్రత కోసం నందిగామ మటన్ వ్యాపారి వినూత్న పథకం!
- ఐదు కేజీల మటన్ కొంటే హెల్మెట్ ఫ్రీ
- ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కూడా కృషి
- ఇంటి నుంచి బాక్సు తెచ్చుకుంటే రూ.20 తగ్గింపు
కృష్ణా జిల్లా నందిగామలో ఓ మటన్ వ్యాపారి తన బిజినెస్ కు సామాజిక హితాన్ని జోడించి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వెంకటేశ్వరరావు అనే మటన్ విక్రయదారు తన వద్ద మటన్ కొన్నవాళ్లకు హెల్మెట్ ఉచితంగా అందిస్తున్నాడు. ఐదు కేజీల మటన్ కొన్న వినియోగదారులకు ఓ హెల్మెట్ ఫ్రీ అంటూ ఆఫర్ ప్రకటించడమే కాదు, అక్షరాలా అమలు చేస్తున్నాడు. ఒక్కొక్కటి రూ.600 విలువ చేసే హెల్మెట్లను వెంకటేశ్వరరావు తన కస్టమర్లకు అందిస్తున్నాడు. రోడ్డుప్రమాదాల్లో తన కస్టమర్లు సురక్షితంగా ఉండాలనే ఈ ప్రయత్నమని వెంకటేశ్వరరావు అంటున్నాడు.
వెంకటేశ్వరరావు సామాజిక బాధ్యత ఇంతటితో ఆగలేదు. ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చేందుకు తన వంతు కృషి చేస్తున్నాడు. కస్టమర్లు మటన్ తీసుకెళ్లేందుకు తమ ఇంటి నుంచి బాక్సులు తెచ్చుకున్నట్టయితే ప్రోత్సాహకంగా కిలో మటన్ పై రూ.20 తగ్గిస్తుంటానని వెల్లడించాడు. మొత్తమ్మీద ఇలాంటి ఆఫర్లతో తన వ్యాపారం కూడా మరింత పెరిగిందని వెల్లడించాడు.