తెలంగాణ ప్రజలు జగన్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాలి: సీపీఐ నారాయణ

16-02-2020 Sun 16:48
  • ఏపీలో మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు
  •  హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుందని వెల్లడి
  • జగన్, చంద్రబాబు ఇద్దరూ దొంగలేనని వ్యాఖ్యలు
CPI Narayana says Telangana people should thank to AP CM Jagan

సీపీఐ అగ్రనేత నారాయణ మహబూబ్ నగర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పాలని అన్నారు. ఏపీలో మూడు రాజధానుల ప్రకటనతో హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకుందని తెలిపారు. ఏపీలో జగన్, చంద్రబాబు ఇద్దరూ దొంగలేనని విమర్శించారు. అటు, బీజేపీపైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ప్రశ్నించేవారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉగ్రవాద బడ్జెట్ అని అభివర్ణించారు. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీ జరుగుతోందని, విపక్షాలపై దాడులు పెరిగాయని ఆరోపించారు.