Kinjarapu Acchamnaidu: బొత్సా... ఈ పందేనికి రెడీయా?: అచ్చెన్నాయుడు సవాల్

Achchannaidu Challenges Botsa Satyanarayana
  • చంద్రబాబు ముసలివారన్న బొత్స
  • తిరుమల కొండకు నడిచి వెళ్లేందుకు సిద్ధమా?
  • ఎవరు ముందు ఎక్కితే వారే కుర్రాళ్లన్న అచ్చెన్నాయుడు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముసలివారని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. చంద్రబాబుతో పాటు బొత్స సత్యనారాయణ కాలినడకన తిరుమల కొండ ఎక్కాలని, ఎవరు ముందు ఎక్కితే వారు కుర్రోళ్లని, ఈ పందేనికి రెడీయా? అని సవాల్ విసిరారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు చేశారు.

"ఎవరు యువకులు - ఎవరు ముసలివాళ్ళు : గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు - ప్రతి పక్ష నాయకుడు అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముసలి వారు అయ్యారు అని వ్యంగ్యంగా ( ఒకరకంగా గేలిచేస్తూ)  అవాకులు చవాకులు పేలుతున్నారు. ఎవరు ముసలి వాళ్ళో-ఎవరు యువకులో తేల్చటానికి ఒక చిన్న పోటీ పెడదాము. బొత్స సత్యనారాయణ గారు ( ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ లోని ఏ మంత్రిగారైనా  సరే ) చంద్ర బాబు గారి కన్నా ముందు కాలినడకన తిరుమల కొండ ఎక్కండి?  ఎవరు ముందు ఎక్కితే వారు కుర్రోళ్ళు. మిగిలిన వారు ముసలోళ్ళు ! ఈ పోటీకి బొత్సగారూ సిద్ధమేనా ! పోటీకి సిద్ధంకాకపోతే ముసలివాణ్ణి అని పత్రికాసమావేశంలో ఒప్పుకోండి!" అని అన్నారు.

ఆపై "ఐటీ వారి పంచనామా చూశాక తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు బుగ్గనా? హైలీ రెస్పెక్టెడ్ విజయసాయిరెడ్డి,  మీరు రాయించింది, చెప్పింది అబద్ధమని మరోసారి తేలింది.క్విడ్ ప్రోకో, మీరు కొట్టేసిన 43 వేల కోట్ల నుంచి 2 వేల కోట్లు పంపితే వృద్ధులకు మీరు ఎత్తేసిన పింఛన్లను మేము చెల్లిస్తాం" అని కూడా మరో ట్వీట్ పెట్టారు.
Kinjarapu Acchamnaidu
Chandrababu
Botsa Satyanarayana
Vijay Sai Reddy

More Telugu News