Chinmayi: నేను క్షమాపణ చెప్పాలా? నెవర్... రాధారవి ఆఫర్ పై గాయని చిన్మయి ఘాటు స్పందన!

Chinmayi Reacts after Radharavi Comments
  • ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణలు చెప్పబోను
  • అసలు ఆ అవసరమే నాకు లేదు
  • చేసిన ఆరోపణలకు కట్టుబడివున్నానన్న చిన్మయి
తాను క్షమాపణలు చెబితే, డబ్బింగ్ కళాకారుల సంఘంలో తిరిగి చేర్చుకుంటానని రాధారవి వ్యాఖ్యానించిన నేపథ్యంలో చిన్మయి ఘాటుగా స్పందించారు. ఆయనకు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. తాను ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని, తాను గతంలో చేసిన విమర్శలకు కట్టుబడే ఉన్నానని బదులిచ్చారు. కాగా, కోలీవుడ్ డబ్బింగ్ కళాకారుల సంఘానికి జరిగిన ఎన్నికల్లో చైర్మన్ పదవికి చిన్మయి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురికాగా, పోటీలో ఉన్న రాధారవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Chinmayi
Radharavi
Sorry
Comments

More Telugu News