Chattisghad: తోడు కోసం 77 ఏళ్ల వయసులో వివాహం... పెళ్లి తరువాత నిండా ముంచేసిన మహిళ!

Old Man Cheated by his Second Wife
  • పెళ్లి కోసం ప్రకటన ఇస్తే, పరిచయమైన ఆశాదేవి
  • పలు దఫాలుగా రూ. 40 లక్షల ఇచ్చిన వృద్ధుడు
  • ఆపై కారుతో సహా పరారీ, పోలీసు కేసు నమోదు
భార్య మరణించిన తరువాత, ఒంటరి జీవితాన్ని అనుభవించ లేక, తనకు ఓ తోడు కావాలని కోరుకున్న 77 ఏళ్ల రిటైర్డ్ అధికారి, ఊహించని రీతిలో దారుణంగా మోసపోయాడు. ఈ ఘటన చత్తీస్ గఢ్ లోని సర్ఖండాలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ రిటైర్డ్ అధికారి, తాను మరో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెబుతూ, ప్రకటనలు ఇచ్చాడు. ఆయన్ను ఆశాశర్మ అనే యువతి సంప్రదించింది.

ఆమె నచ్చడంతో పెళ్లికి అంగీకరించిన వృద్ధుడు, ఆమెను చేసుకున్నారు. ఆపై ఆశాదేవి కోసం తరచూ ఇద్దరు యువకులు వారి ఇంటికి వస్తుంటే, తన బంధువులేనని చెబుతూ వచ్చింది. వివిధ కారణాలు చెబుతూ, పలు దఫాలుగా ఆయన్నుంచి రూ. 40 లక్షలు తీసుకుంది. కట్టుకున్న భార్యేనన్న ఉద్దేశంతో సదరు వ్యక్తి, ఆమె అడిగినప్పుడల్లా డబ్బులిచ్చాడు. ఉన్నట్టుండి ఆయన కారుతో సహా ఆశాదేవి మాయం కావడంతో, తాను మోసపోయానని గుర్తించి, పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయంలో కేసు నమోదు చేసిన పోలీసులు, ఆశాదేవి ఆచూకీ కోసం వెతుకుతున్నారు.
Chattisghad
Second Marriage
Old Man
Fruad

More Telugu News