VV Vinayak: గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన వీవీ వినాయక్

VV Vinayak accepts Green India Challenge
  • తెలంగాణలో ఉత్సాహంగా గ్రీన్ ఇండియా చాలెంజ్
  • సెలబ్రిటీల నుంచి విశేష స్పందన
  • తన ఆఫీసులో మొక్కలు నాటిన దర్శకుడు వినాయక్
తెలంగాణలో గ్రీన్ ఇండియా చాలెంజ్ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా సెలబ్రిటీల నుంచి ఈ చాలెంజ్ కు విశేషమైన స్పందన వస్తోంది. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ చాలెంజ్ ను తాజాగా సినీ దర్శకుడు వీవీ వినాయక్ స్వీకరించారు. హైదరాబాదులోని తన కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మానవాళి మనుగడకు మొక్కలు ఎంతో అవసరమని అన్నారు. ఈ చాలెంజ్ కు రూపకల్పన చేసిన టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు. అంతేకాదు, చాలెంజ్ లో భాగంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్, నిర్మాతలు నల్లమలుపు బుజ్జి, మల్లిడి సత్యనారాయణరెడ్డిలను నామినేట్ చేశారు.
VV Vinayak
Green India Challenge
Santosh Kumar
TRS MP
Bellamkonda Srinivas

More Telugu News