ఆదిలాబాద్ జిల్లా తాంసీ శివారులో పులి సంచారం.. బెదిరిపోతున్న ప్రజలు

15-02-2020 Sat 18:05
  • మహారాష్ట్ర లోని తిప్పేశ్వర్ అడవుల్లోంచి వస్తోన్న పులులు
  • భీంపూర్ సరిహద్దుల్లో పులుల సంచారం
  • భయంతో జీవిస్తున్న స్థానికులు
Tiger Wandering at Tamsi Village

ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల గొల్లఘాట్ గ్రామంలోకి ప్రవేశించిన పులి ఒక ఆవును బలిగొన్న విషయం మరువక ముందే.. భీంపూర్ మండలం తాంసీ గ్రామ శివారులో మళ్లీ పులి సంచారం కలకలం రేపుతోంది. అధికారులు తమకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తాంసి గ్రామం మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంగా ఉంటుంది. ఇక్కడి అటవీ ప్రాంతం విశాలమైనది. తరచుగా పులులు మహారాష్ట్ర లోని తిప్పేశ్వర్ నుంచి భీంపూర్ సరిహద్దుల్లోకి ప్రవేశిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు పులి భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడుతున్నారు.  కాగా గతేడాది డిసెంబర్లో తాంసి శివారులో చిరుత పులి కళేబరం సంచలనం రేపింది. దీన్ని స్థానికులు చంపారా? లేదా ఎవరైనా వేటగాళ్లు చంపారా? అన్న విషయం ఇంకా తేలలేదు.