Simbu: శింబుతో లవ్ లో పడలేదు .. అవన్నీ పుకార్లు మాత్రమే: హీరోయిన్ సుభిక్ష

  • నేను .. శింబు స్నేహితులం మాత్రమే
  • మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు 
  • పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టమన్న సుభిక్ష
Subiksha

తమిళనాట శింబు సినిమాలకంటే ఆయనకిగల ఎఫైర్ల గురించే ఎక్కువగా మాట్లాడుకుంటారు. గతంలో హన్సికతో ఆయన ప్రేమలో పడటమనేది బాగా హైలైట్ అయింది. ఆ సమయంలో ఆయన మానసికపరమైన వత్తిడికి లోనైనట్టు కూడా చెబుతారు. ఇక ఇప్పట్లో ప్రేమజోలికి వెళ్లడని అంతా అనుకున్నారు. కానీ 'అన్నకొడి' సినిమాతో తమిళ తెరకి పరిచయమైన 'సుభిక్ష'తో ఆయన ప్రేమలో పడినట్టుగా కోలీవుడ్లో ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోనున్నట్టుగా కూడా చెప్పుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో సుభిక్ష స్పందిస్తూ .. "నేను .. శింబు మంచి స్నేహితులం మాత్రమే. మా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగుతోందని మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు. ఒక ఫంక్షన్ కి మేమిద్దరం కలిసి హాజరు కావడం ఈ పుకారుకి కారణమై ఉండొచ్చు. ఇక ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టండి .. మున్ముందు నేను శింబుతో కలిసి చాలా సినిమాలు చేయవలసి వుంది" అని చెప్పుకొచ్చింది.

More Telugu News