ప్రగతిశీల రాష్ట్రాలను ప్రోత్సహించడం మాని శిక్షిస్తారా?: నాస్కామ్ సదస్సులో మంత్రి కేటీఆర్
- రాష్ట్రాలకు ఇచ్చే పన్నుల వాటా తగ్గించడంపై అసంతృప్తి
- దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి రూ.4 వేల కోట్ల నష్టం
- ఆర్థిక క్రమశిక్షణ పాటించే వారికి ఇది నిరాశ కలిగిస్తుంది
‘మీ దృష్టిలో ఇది ఒక్క శాతమే కావచ్చు. కానీ దీనివల్ల మా రాష్ట్రం ఏటా నాలుగు వేల కోట్ల రూపాయలు నష్టపోతుంది. ఇది రాష్ట్రాల అభివృద్దికి విఘాతం కలిగించే చర్య. మీ చర్య వల్ల ప్రగతిశీల రాష్ట్రాలు ఎందుకు నష్టపోవాలి?’ అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు.
రాష్ట్రాలకు ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వకుంటే కేంద్రం కలలుగంటున్న ఐదు ట్రిలియన్‌ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం అని పరోక్షంగా చురకంటించారు.