నా అదృష్టమే ఆండ్రీ కొచ్చివ్... తన 'లవ్ స్టోరీ' గురించి హీరోయిన్ శ్రియ ఆసక్తికర ముచ్చట్లు!

15-02-2020 Sat 07:57
  • తొలిసారిగా మాల్దీవుల్లో కలిశాం
  • ఆన్ లైన్ లో నా సినిమాలన్నీ చూశాడు 
  • 'అర్జున్' సినిమా షూటింగ్ ప్రాంతానికి తీసుకెళ్లాడు
  • తాజా ఇంటర్వ్యూలో శ్రియ
Shreyas Intresting Lovers Day Interview
తన జీవితంలో తనకు లభించి అదృష్టం భర్త ఆండ్రీ కొచ్చివ్ రూపంలో లభించిందని హీరోయిన్ శ్రియ వ్యాఖ్యానించింది. అతనిలా తనకు మద్దతిచ్చే భర్త దొరకడం అదృష్టమని ఆనందిస్తోంది. తాజాగా ఓ ఆంగ్ల దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూను ఇచ్చిన శ్రియ, తన లవ్ స్టోరీకి సంబంధించిన పలు విషయాలను పంచుకుంది.

తామిద్దరమూ తొలిసారిగా మాల్దీవుల్లో కలిశామని, అప్పటికి తాను నటిస్తున్నానన్న విషయం అతనికి తెలియదని, విషయం తెలిశాక, ఆన్ లైన్ లో తన సినిమాలను చూశాడని తెలిపింది. తాను 'అర్జున్' చిత్రం షూటింగ్ లో భాగంగా సెయింట్ పీటర్స్ బర్గ్ లో షూటింగ్ లో పాల్గొన్నానని, ఆ విషయాన్ని తాను మరచిపోయినా ఆండ్రీ గుర్తుంచుకున్నాడని చెప్పింది.

తాము కలిసిన తొలినాళ్లలో అదే ప్రాంతానికి తీసుకెళ్లి, షూటింగ్ జరిగిన ప్లేస్ ను చూపిస్తూ, ఇక్కడే పాట పాడుతూ, డ్యాన్స్ చేశావని చెప్పాడని, ఆ విషయం తనకెంతో నచ్చిందని వెల్లడించింది. గత సంవత్సరం ప్రేమికుల దినోత్సవం రోజున 'ది నట్ క్రాకర్' అనే ప్రదర్శనకు తీసుకెళ్లాడని, ఆ షోను ఎంతో ఎంజాయ్ చేశానని తెలిపింది.

కాగా, ప్రస్తుతం శ్రియ, ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో ఓ స్పెషల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో తెలుగు సినిమాలోనూ ఆమె నటిస్తోంది.