RRR: మహేశ్, ప్రభాస్ హీరోలుగా రాజమౌళి తదుపరి చిత్రం!

Rajamouli Next Movie with Mahesh and Prabhas
  • ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'తో బిజీ
  • తదుపరి కేఎల్ నారాయణ నిర్మాతగా చిత్రం
  • హీరోలుగా మహేశ్, ప్రభాస్
ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'తో బిజీగా ఉన్న రాజమౌళి, తన తదుపరి చిత్రాన్ని కూడా లైన్ లో పెట్టేశాడని, 'బాహుబలి'ని మించేలా ఉండే ఈ భారీ పీరియాడికల్ చిత్రంలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి నటిస్తారని టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక సమాచారం లేకున్నా, వీరి ముగ్గురి పేర్లూ వినగానే, ఫ్యాన్స్ కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు.

తన కెరీర్ లో పరాజయాన్ని ఎరుగని రాజమౌళి, వచ్చే సంవత్సరం వరకూ 'ఆర్ఆర్ఆర్'తో బిజీ. ఆ తరువాతే తదుపరి చిత్రం గురించి ఆయన ఆలోచిస్తారనడంలో సందేహం లేవు. వాస్తవానికి మహేశ్ తో రాజమౌళి సినిమా ఎప్పుడో రావాల్సింది. కేఎల్ నారాయణ నిర్మాతగా ఓ చిత్రాన్ని రాజమౌళి అంగీకరించారు కూడా. రాజమౌళి తరువాతి సినిమా ఇదేనని, ఇదే చిత్రంలో ప్రభాస్ కూడా ఉంటారని, యూవీ క్రియేషన్స్ బ్యానర్ కూడా నిర్మాతగా ఉంటుందని చాలా వార్తలు వినిపిస్తున్నాయి. మరిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి.
RRR
Rajamouli
Mahesh Babu
Prabhas

More Telugu News