Kannababu: ఏమీ తవ్వకుండానే ఎలుకలు దొరికాయి... సరిగ్గా తవ్వితే ఏనుగులు దొరుకుతాయి: ఏపీ మంత్రి కన్నబాబు సెటైర్

AP minister Kannababu says there is more to reveal
  • ఏపీలో తీవ్ర కలకలం రేపుతున్న ఐటీ దాడులు
  • వైసీపీ నేతలకు, టీడీపీ నాయకులకు మధ్య మాటల యుద్ధం
  • చంద్రబాబు హద్దుల్లేని అవినీతికి పాల్పడ్డారంటూ కన్నబాబు ఆరోపణ

ఏపీలో ఐటీ దాడుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ నివాసంపై జరిగిన ఐటీ దాడులు అధికార, విపక్షాల మధ్య అగ్నికి ఆజ్యం పోశాయి. ఈ దాడుల అంశాన్ని వైసీపీ నేతలు టీడీపీకి ముడిపెడుతుండగా, వైసీపీ విమర్శలకు టీడీపీ నేతలు గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నేతలు దీటుగా బదులిచ్చేందుకు ప్రయత్నిస్తున్నా, వైసీపీ మంత్రులు మాత్రం వెనక్కితగ్గడంలేదు. తాజాగా, ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పందించారు.

చంద్రబాబు హద్దుల్లేని అవినీతికి పాల్పడ్డారని, పర్యవసానమే ఈ ఐటీ దాడులని ఆరోపించారు. చంద్రబాబు మాజీ పీఎస్ వద్ద రూ.2 వేల కోట్లు ఉన్నట్టు ఐటీ శాఖ పేర్కొందని, కానీ లోకేశ్ వైఖరి చూస్తుంటే, పట్టుకున్నది చాలా తక్కువే, తమ దగ్గర చాలా ఉంది అనేవిధంగా ట్వీట్ చేశాడని ఎద్దేవా చేశారు. తొందరపడాల్సిన పనిలేదని, మీ బాగోతాలన్నీ బయటికి వస్తాయని లోకేశ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏమీ తవ్వకుండానే ఎలుకలు దొరికాయని, సరిగ్గా తవ్వితే ఏనుగులు దొరుకుతాయని అన్నారు.

  • Loading...

More Telugu News