AP Legislative Council: సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ఫైల్ ను రెండోసారి కూడా వెనక్కి పంపిన అసెంబ్లీ కార్యదర్శి!

AP assembly secretary rejects select committee file second time
  • సెలెక్ట్ కమిటీల ఏర్పాటుపై అనిశ్చితి
  • నిబంధనల ప్రకారం వీలుకాదన్న అసెంబ్లీ కార్యదర్శి
  • మండలి చైర్మన్ కు పంపిన నోట్ లో స్పష్టం చేసిన అసెంబ్లీ కార్యదర్శి

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తూ ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే సెలెక్ట్ కమిటీల ఏర్పాటు ఇప్పట్లో సాధ్యమయ్యేట్టు కనిపించడంలేదు. సెలెక్ట్ కమిటీల ఏర్పాటు కోసం అసెంబ్లీ కార్యదర్శికి మండలి నుంచి వెళ్లిన ఫైల్ ఇప్పటికే ఓసారి తిరస్కరణకు గురైంది. తాజాగా, మండలి చైర్మన్ మరోసారి ఫైల్ పంపగా, అసెంబ్లీ కార్యదర్శి రెండోసారి కూడా వెనక్కి పంపారు. నిబంధనల ప్రకారం సెలెక్ట్ కమిటీల ఏర్పాటు సాధ్యం కాదని అసెంబ్లీ కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ మేరకు శాసనమండలి చైర్మన్ కు అసెంబ్లీ కార్యదర్శి నోట్ పంపారు.

  • Loading...

More Telugu News