Kalavenkatrao: దేశంలో జరిగే సోదాలన్నీ చంద్రబాబుకు అంటగడుతున్నారు: కళా వెంకట్రావు

Kalavenkatrao comments on YSRCP
  • జగన్ సహా వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నా
  • ఎనిమిదేళ్లుగా జగన్ కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో?
  • ఇటువంటి వాళ్లా బాబు కుటుంబంపై నిందలు వేసేది!
చంద్రబాబు మాజీ పీఎస్ నివాసంపై ఐటీ దాడుల వ్యవహారంపై అధికారపక్ష సభ్యులు చేస్తున్న ఆరోపణల పట్ల టీడీపీ నేత కళా వెంకట్రావు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుపై జగన్ మీడియా సహా వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. దేశంలో జరిగే సోదాలన్నీ చంద్రబాబుకు అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎనిమిదేళ్లుగా జగన్ కోర్టుల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యక్తులా చంద్రబాబుపై నిందలు వేసేది? అని ప్రశ్నించిన కళా వెంకట్రావు, జగన్ కు కోర్టులు, వ్యవస్థలపై గౌరవం లేదని విమర్శించారు. భయపెట్టి పాలన చేసే వారు చరిత్రలో కనుమరుగయ్యారంటూ జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. టీడీపీపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్న జగన్ చరిత్ర ఏంటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖలను, పోలీస్ వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత జగన్ దే అంటూ ధ్వజమెత్తారు.
Kalavenkatrao
Telugudesam
Jagan
YSRCP
cm

More Telugu News