China: కరోనా ఎఫెక్ట్: చైనాలో పెంపుడు జంతువులకూ మాస్కులు.. వైరల్ అవుతున్న ఫొటోలు

Pets In China Wear Face Masks Amid Coronavirus Crisis
  • సర్జికల్ మాస్కులకు రంధ్రాలు చేసి కడుతున్న తీరు 
  • చైనాలో ఉన్న ఆందోళనకర పరిస్థితికి అద్దం పడుతోందంటున్న నిపుణులు 
  • వైబోలో వీడియోలు, ఫొటోలు వైరల్
చైనాలో కరోనా వైరస్ భయం మరింతగా పెరిగిపోతోంది. చాలా మంది తమ పెంపుడు కుక్కలు, పిల్లులు వంటి జంతువులకు కూడా మాస్కులు కట్టి తీసుకెళ్తున్నారు. చైనాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫాం వైబో (Weibo)లో దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. మనం పెట్టుకునే సర్జికల్ మాస్కులను ఆ పెంపుడు జంతువులకు సరిపోయేలా మార్చుతున్నారు. వాటి కళ్లు ఉండే చోట రంధ్రాలు చేసి కడుతున్నారు. ఇది వినడానికి సరదాగా ఉన్నా.. చైనాలో జనం పడుతున్న ఆందోళనకు ఇది అద్దం పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పిల్లులు, కుక్కలతో కరోనా వ్యాప్తి కాదు

పిల్లులు, కుక్కల వంటి పెంపుడు జంతువులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ఇప్పటికే ప్రకటించింది. అయితే చైనా నేషనల్ హెల్త్ కమిషన్ మాత్రం ఈ వాదనను తప్పుపడుతోంది. వైరస్ సోకిన వ్యక్తులకు దగ్గరగా పెంపుడు జంతువులు వెళితే.. వాటిపైకి వైరస్ చేరుతుందని, అలా వేరే వ్యక్తులకు సోకుతుందని పేర్కొంది. దీంతో చైనాలో జనం తమ పెంపుడు జంతువులకు మాస్కులు కడుతున్నారు.
China
Corona Virus
pets
masks
Corona Virus epidemic

More Telugu News