Botsa Satyanarayana: శ్రీనివాస్ సెక్రటరీగా పనిచేసిన కాలంలో రూ.2 వేల కోట్ల మేర లావాదేవీలు జరిగాయి: బొత్స

AP minister Botsa comments on IT Raids issue
  • చంద్రబాబు మాజీ సెక్రటరీ నివాసంలో ఐటీ దాడులు
  • స్పందించిన మంత్రి బొత్స
  • 40 చోట్ల సోదాలు జరిగాయన్న బొత్స
గత సీఎం వద్ద ప్రైవేటు సెక్రటరీగా పనిచేసిన శ్రీనివాస్ పై ఐటీ దాడులు జరిగాయని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మొత్తం 40 చోట్ల సోదాలు జరిపినట్టు ఐటీ శాఖ వెల్లడించిందని తెలిపారు. శ్రీనివాస్ ప్రైవేటు సెక్రటరీగా పనిచేసిన కాలంలో రూ.2 వేల కోట్ల మేర లావాదేవీలు జరిగాయని, శ్రీనివాస్ తాను జరిపిన లావాదేవీలకు సంబంధించి పన్నులు ఎగ్గొట్టారని పేర్కొన్నారు. మూడు కంపెనీల్లో శ్రీనివాస్ ప్రమేయం ఉన్నట్టు కనిపిస్తోందని అన్నారు. పేదలకు కట్టిన ఇళ్లలో కూడా భారీగా దోచుకున్నారని బొత్స మండిపడ్డారు.
Botsa Satyanarayana
Srinivas
Chandrababu
Telugudesam
IT Raids

More Telugu News