నిర్భయ కేసును విచారిస్తూ స్పృహ కోల్పోయిన సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ భానుమతి
- తీర్పును వెలువరిస్తున్న సమయంలో కళ్లు తిరిగి పడిపోయిన జస్టిస్ భానుమతి
- హుటాహుటిన ఛాంబర్ కు తీసుకెళ్లిన కోర్టు సిబ్బంది
- కేసును వచ్చే వారానికి వాయిదా వేసిన ధర్మాసనం
మరోవైపు జస్టిస్ భానుమతి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. ఆరోగ్యం బాగోలేకపోయినా కేసు విచారణ నిమిత్తం వచ్చారని చెప్పారు. ఛాంబర్ లోనే ఆమెను వైద్యులు పరీక్షిస్తున్నారని తెలిపారు. దీనికి ముందే దోషి వినయ్ శర్మ పెట్టుకున్న పిటిషన్ ను జస్టిన్ భానుమతి నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.