Peddapalli District: గాల్లోకి 14 రౌండ్ల కాల్పులు.. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు

police arrests paddapalli man
  • పెద్దపల్లి జిల్లాలో ఘటన
  • కాల్పులు జరిపి కలకలం రేపిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి
  • సామాజిక మాధ్యమాల్లో వీడియో

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో కాల్పులు జరిపి కలకలం రేపిన ఆర్మీ విశ్రాంత ఉద్యోగి తిరుమల రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ధర్మారం మండలం సాయంపేటకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ రెడ్డి ఈ రోజు ఉదయం మీడియాకు వివరించి చెప్పారు.

తిరుమలరెడ్డి గాల్లోకి కాల్పులు జరుపుతుండగా తీసిన ఓ వీడియోను కొందరు రెండు రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తిరుమల రెడ్డి గాల్లోకి 14 రౌండ్ల కాల్పులు జరిపాడని పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో అతడి ఇంటికి వెళ్లిన పోలీసులు అతడిని అరెస్టు చేసి, తుపాకీ, ఆరు తూటాలు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News