శివోహం... శివోహం... మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలు!

14-02-2020 Fri 11:45
  • శ్రీశైలంలో 24 వరకూ ఆర్జిత సేవలు రద్దు
  • శివ స్వాములకు మాత్రమే స్పర్శ దర్శనం
  • కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు
Piligrims rush to srisailam for brahmotsavams

వారణాసి, శ్రీశైలం, చిదంబరం, అమరావతి తదితర దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాల్లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 24 వరకూ అన్ని రకాల ఆర్జిత సేవలనూ రద్దు చేస్తున్నట్టు శ్రీశైలం దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఈ నెల 18వ తేదీన రాత్రి 7.30 గంటల వరకూ ఇరుముడి కట్టుకుని శివదీక్ష చేసి మల్లికార్జునుని దర్శనం కోసం వచ్చే భక్తులకు మాత్రమే స్పర్శదర్శనం ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.

ఇక శ్రీకాళహస్తి, భీమవరం, విజయవాడ ఇంద్రకీలాద్రి తదితర క్షేత్రాల్లోని శైవాలయాలకు భక్తుల తాకిడి ప్రారంభమైంది. మరో పది రోజుల పాటు శైవక్షేత్రాల్లో రద్దీ కొనసాగనుంది. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు.