Saitej: ‘సోలో బ్రతుకే సో బెటర్ ’ అంటున్న హీరో సాయితేజ్ మూవీ థీమ్ సాంగ్ విడుదల

 solo brathuke so better movie theme song has released
  • సాయి తేజ్ కొత్త చిత్రం సోలో బ్రతుకే సో బెటర్’
  • ‘సింగల్ సోదరసోదరీమణులారా..’ అంటూ వీడియో లింక్ పోస్ట్
  • అలాగే, ‘ప్రేమ’ అనేది కూడా ఒక ఫీలింగేగా, మారదని గ్యారంటీ ఏంటి?
రేపు వాలంటైన్స్ డే  నేపథ్యంలో ప్రముఖ హీరో సాయి తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే  సో బెటర్’ మూవీ థీమ్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘సింగల్ సోదరసోదరీమణులారా..’ అంటూ సాయి తేజ్ ట్వీట్ చేస్తూ థీమ్ సాంగ్ వీడియో లింక్ ను పోస్ట్ చేశారు.

‘కోపం, ఇష్టం, విచారం, సంతోషం, ఆనందం, బాధ.. ఇవన్నీ కాలంతో పాటు కారణాలతో పాటు మారిపోయే ఫీలింగ్స్.. అలాగే, ‘ప్రేమ’ అనేది కూడా ఒక ఫీలింగేగా, మారదని గ్యారంటీ ఏంటి?..  ‘సోలో బ్రతుకే సో బెటర్ ?’ అంటూ సాయితేజ్ అనడం కనబడుతుంది. కాగా సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది మే 1న విడుదల కానుంది. సాయి తేజ్ సరసన నభా నటేష్ నటిస్తోంది.
Saitej
Hero
solo bratuke so better
movie
theme song

More Telugu News