మా హయాంలో ‘పోలవరం’ పనులు 67 శాతం పూర్తి చేశాం..ఇవిగో వివరాలు: నారా లోకేశ్

13-02-2020 Thu 19:31
  • వివరాల ‘లింక్’ ను పోస్ట్ చేసిన లోకేశ్
  • నాడు రాజ్యసభలో కేంద్రం లిఖిత పూర్వక సమాధాన ప్రతి కూడా
  • జగన్ నాడొక మాట, నేడొక మాట చెబుతున్నారు
Nara Lokesh says During our tenure we have completed 67 percent fo Polavaram Project works

చంద్రబాబునాయుడు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులకు పునాది పడలేదని నాడు ప్రతిపక్ష నేతగా చెప్పిన జగన్, ఇప్పుడు 58 శాతం ‘పోలవరం’ పనులు బాబు పాలనలో పూర్తయ్యాయని సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారంటూ నారా లోకేశ్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

ఇదే అంశంపై మరోమారు లోకేశ్ మరో పోస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఏం చెప్పారో ఇంతకుముందు పోస్ట్ లో ప్రస్తావించానని అన్నారు. చంద్రబాబు హయాంలో 67 శాతం పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేశామని, ఇందుకు సంబంధించిన వివరాల కోసం సంప్రదించామంటూ ఓ లింక్ ను పోస్ట్ చేశారు. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది చెప్పిన సమాధానాలను జతపరిచానంటూ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.